Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ విశ్వకర్మ బీమా అమలు చేయాలి: శ్రీరామ్ మహిపాల్ చారి

 విశ్వకర్మ బీమా అమలు చేయాలి: శ్రీరామ్ మహిపాల్ చారి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్:  విశ్వకర్మ బీమా పథకమును అమలు చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ    ఇటీవల  విశ్వబ్రాహ్మణుల వరస ఆత్మహత్యలు.. కలవర పాటకు గురిచేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ముండరాయి సత్యం.. మెదక్ జిల్లాకు చెందిన లష్కరి నరేష్ చారి.. వీరు మాత్రమే కాదు ఇంకా బయటకు రాని అప్పుల బాధతో ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు.. విశ్వబ్రాహ్మణ చేతి కుల వృత్తులైన కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, కంచరి, శిలాశిల్పం.. సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడుతున్న వారికి విశ్వకర్మ భీమా పథకాన్ని అమలు చేయాలని అన్నారు.. కార్పొరేట్ వ్యవస్థ మల్టీ బ్రాండెడ్ కంపెనీలు. కులవృత్తులు చేతి వృత్తులను జీవనోపాధి కొల్లగొడుతూ విశ్వబ్రాహ్మణులను జీవితాలని అగమ్య గోచరంగా  ఆగమాగం చేసి ఉపాధి   లేకుండా చేసి బ్రతుకులను ఆగం చేసినాయి… ప్రస్తుత కాలానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడానికి ఆర్థిక స్థోమత లేక వారితో పోటీ పడలేక కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అనేకం.. ప్రభుత్వాలు విశ్వకర్మల జాతినీ చిన్నచూపు చూడడం మానుకోవాలి. చనిపోయిన విశ్వబ్రాహ్మణులకు విశ్వకర్మ భీమా కచ్చితంగా అమలు చేయాలని అన్నారు.

అలాగే  విశ్వకర్మలకు ₹5000 పెన్షన్ ఇవ్వాలి. విశ్వకర్మ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా మా విశ్వబ్రాహ్మణులకు చేయుత అందించి ఆర్థిక సహాయం అందించాలి… ఈ పోటీ ప్రపంచంలో  నిలదొక్కుకునేలాఆర్థిక తోడ్పాటు అందించి విశ్వబ్రాహ్మణులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే విశ్వబ్రాహ్మణుల అన్ని సంఘాలు ఏకతాటి పైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన హక్కులు సాధించే వరకు కలిసి ముందుకు నడిచి మన సంప్రదాయ వృత్తిని కాపాడుకొని అలాగే విశ్వబ్రాహ్మణ కులాలకు చేదోడువాదోడుగా ఉండి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలని అలాగే.. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని  ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -