Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విశ్వకర్మలు అన్ని రంగాలలో రాణించాలి

విశ్వకర్మలు అన్ని రంగాలలో రాణించాలి

- Advertisement -

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

విశ్వకర్మలు అన్ని రంగాలలో రాణించాలని, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ చదివించాలని బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలలో  విశ్వకర్మ మండల కమిటీ 2026 క్యాలెండర్ ను మండల అధ్యక్షులు భాస్కర్ ఆచారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పారు. విశ్వకర్మలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్య ఇస్తుందని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే అన్నిటికీ మూలం.. చదివేనని చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ప్రభుత్వం కూడా విద్యకు, వైద్యానికి ఎంతో ప్రాధాన్యతస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ వ్యాపార సంఘం అధ్యక్షులు గంజి కృష్ణ, రెడ్డి యువజన సంఘం సభ్యులు దోమ కరుణాకర్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ మండల కమిటీ గౌరవాధ్యక్షులు వెంకటాచారి, ఆచారి, చంద్రమౌళి చారి, ఉపాధ్యక్షులు భాస్కరాచారి కమిటీ సభ్యులు లక్ష్మీనాచారి, శేఖర్, అఖిల్,ఆదిత్య చారీ, శ్రీనివాస్ చారి, శివచందర్, నరసింహ చారి, శ్రీధర్, విష్ణు చారి, రవి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -