Friday, November 21, 2025
E-PAPER
Homeకరీంనగర్గ్రామాలలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి..

గ్రామాలలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి..

- Advertisement -

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి

పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ  మహేష్ బిగితే తనిఖీ చేశారు.స్టేషన్ పరిసరాలను , వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు,స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి,స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైం హాట్స్పాట్స్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెండింగ్ కేసులు,కోర్టు కేసులు,ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు,నేరాల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని,ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది,అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే తగిన కార్యాచరణ ప్రారంభించాలన్నారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు.

స్టేషన్ పరిధిలో క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తునే వాటి వలన కలుగు అనర్ధాలపై, సైబర్ నేరాల నియంత్రణ పై చైతన్య పరచాలని,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ప్రతి రోజు విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, ఎస్.ఐ ఉపేందర్, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -