Saturday, March 7, 2026
E-PAPER
Homeఖమ్మంపని ప్రదేశాలను సందర్శించాలి

పని ప్రదేశాలను సందర్శించాలి

- Advertisement -

– ప్రతీ కూలీ ని ఎన్ఎంఎంఎస్ లో అప్లోడ్ చేయాలి – ఏపీడీ ఎన్.రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట 

కూలీల హాజరు శాతం పెంచాలని,ప్రతీ సిబ్బంది పని ప్రదేశాన్ని సందర్శించి ఎన్ఎంఎంఎస్ లో కూలీల ను నమోదు చేయాలని డీఆర్డీడీఏ ఏపీడీ ఎన్.రవి వీబీ జీ రాం జీ  పధకం సిబ్బంది కి సూచించారు. ఆయన శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు కి కనీసం 50 మంది కూలీలు తగ్గకుండా పని కల్పించాలని,99 రోజుల ప్రణాళిక లో పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అప్పారావు,ఎపీఓ రాంచందర్ రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -