– నొట్టింగామ్ యూనివర్సిటీ ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యుకెకు చెందిన నొట్టింగామ్ యూనివర్సిటీ ప్రతినిధులు సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని సందర్శించి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలతో కలిసి పని చేయాలనే ఆసక్తిని వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తీసుకొస్తున్న సంస్కరణలను బాలకిష్టారెడ్డి వారికి వివరించారు. కరిక్యులంతో పాటు పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యం అందించేలా పలు మార్పులు చేసినట్టు ఆయన తెలిపారు. ఇంతకుముందే జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్‌ఏ యూనివర్సిటీలతో కలిసి పని చేసేందుకు చర్చలు జరిపినట్టు చెప్పారు. సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, పేటెంట్స్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఏక్స్‌ఛేంజ్ తదితర విషయాలపై కలిసి పని చేసే అవకాశాలపై వారు చర్చించారు. తెలంగాణలో ఇండియన్ ఆఫ్ క్యాంపస్‌ను నెలకొల్పాలని ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి వారికి సూచించారు. ఉన్నత విద్యా మండలిని సందర్శించిన వారిలో ఆ యూనివర్సిటీ రీజినల్ పాట్నర్‌షిప్స్ మేనేజర్ ఆండ్రియా ఎల్లాన్స్, ఇంటర్నేషనల్ రిక్రూట్ మెంట్ మేనేజర్ ఇండియా విజయవాణి యల్లా ఉన్నారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ పాల్గొన్నారు.
ఉన్నత విద్యామండలిని సందర్శించిన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



