హీరో తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా కథానాయిక రితికా నాయక్ మీడియాతో మాట్లాడుతూ,’నా తొలి చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ఇందులో అవకాశం వచ్చింది. అద్భుతమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. హిమాల యాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్. తనలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా నా పాత్ర గురించి రివీల్ చేయకూడదు. ఇందులో ఉన్న యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్‌కు గొప్ప అనుభూతినిస్తుంది. తేజ చాలా ప్రొఫెషనల్. డెడికేటెడ్‌గా వర్క్ చేస్తారు. మనోజ్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. జగపతిబాబుతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్రీయాతో స్క్రీన్స్ షేర్ చేసుకోవడం మంచి ఎక్స్‌పీరియన్స్. కార్తీక్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. దాదాపు 80% లైవ్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. హరి గౌర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పాటలు విజువల్‌గా చాలా అద్భుతంగా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమా కోసం మా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. వారి కష్టానికి మంచి ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
విజువల్ వండర్
- Advertisement -
- Advertisement -