లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి అధ్యక్షులు ప్రసాద్
లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే
నవతెలంగాణ-పాలకుర్తి
ఇంజనీర్లకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శమని లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి అధ్యక్షులు చారగొండ్ల ప్రసాద్ అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను పురస్కరించుకొని గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో ఇంజనీర్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. విశ్వేశ్వరయ్య ప్రముఖ సివిల్ ఇంజనీర్ గా, దూరదృష్టి గల ప్లానర్ గా కృష్ణరాజ సాగర (కె ఆర్ ఎస్) ఆనకట్ట నిర్మాణంలో ప్రతిభను కనబరిచి నేటి ఇంజనీర్లకు మార్గదర్శిగా నిలిచాడని తెలిపారు. 1955 లోనె విశ్వేశ్వరయ్యకు భారతరత్న అవార్డు లభించిందని తెలిపారు.
విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో నేటి ఇంజనీర్లు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇంజనీర్లు దేశ అభివృద్ధికి వెన్నముఖ వంటి వారిని తెలిపారు. ఆధునిక, సాంకేతిక, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి రంగాల్లో ఇంజనీర్ల పాత్ర మరువలేనిదని అన్నారు. ఇంజనీర్ డే ను పురస్కరించుకొని విద్యుత్ శాఖ ఏఈ ఆవిరినేని రణధీర్ రావు, నీటిపారుదల శాఖ ఏఈలు కమలాకర్, పోగు వెంకటేష్, విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ రామకృష్ణ లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి బాధ్యులు ఎర్రబెల్లి రాఘవరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి కోశాధికారి పబ్బ సంతోష్,డాక్టర్ మంద బుచ్చిరెడ్డి, నంగునూరి రవీందర్, బజ్జూరి వేణుగోపాల్, నాగమల్ల సోమేశ్వర్, ఇమ్మడి దామోదర్, పోగు శ్రీనివాస్, పన్నీరు సారంగపాణి, చిదురాల మహేందర్, రాపాక రమేష్, గజ్జి సంతోష్, మాచర్ల పుల్లయ్య, అల్లాడి వెంకన్న, మామిండ్ల శోభన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య ఆదర్శం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES