జక్కే వీరస్వామి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
సర్వాయి పాపన్న మోకు దెబ్బ గీత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన బైరి విశ్వనాథం గౌడు ను ఎంపిక చేశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జెక్కే వీరస్వామి శుక్రవారం నాడు నాడు నియామక పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బైరి విశ్వనాథం మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పైగా ప్రాణాలు పణంగా పెట్టి గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.రాష్ట్ర కార్యదర్శిగా గీత కార్మికుల అభ్యున్నతి కోసం,వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై సర్వాయి పాపన్న మోకు దెబ్బ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ నియామకం పట్ల జర్నలిస్టులు పోతుగంటి సంపత్ దూడల సాగర్ సందెన శంకర్ గౌడ సంఘం నాయకులు నేమిల రాజయ్య జైన్ మందిర్ వద్ద శాలువాతో సన్మానం చేశారు. కొలనుపాక మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య కాంగ్రెస్ నాయకులు గడ్డం సిద్ధులు, ఉపాధ్యాయులు వంగవీర రఘు,వెంకటేష్ ,భూమలింగం,శ్రీధర్ రావు,బాల నరసయ్య,మంజుల అరుణ అభినందనలు తెలిపారు.
మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శిగా విశ్వనాథం నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES