శ్రీ విఠల్ రుక్మిణి ని దర్శించు కున్న మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ విటళేశ్వర్ ఆలయంలో గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు మంగళవారం ఉదయం ప్రమోద్ మహారాజ్ గ్రామస్తులు, ఆలయ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాకడ హారతి నిర్వహించి గ్రామంలోని ప్రధాన విధుల గుండా విఠల్ రుక్మిణి దేవత మూర్థులకు రథ యాత్ర నిర్వహించి, ముంగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు యాదవ్, మున్నూరు కాపు కులస్తులు ఆర్యా వైయిష్యులు పాల్గొని మహా అన్నదాన కార్యక్రమం చెప్టడం జరిగింది. కుభీర్ లో రెండవ పండరి పురం గ పిలువబడే శ్రీ విఠళేశ్వర దేవత మూర్తులను దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రావడం జరిగింది.
దింతో ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. చుట్టూ ప్రక్కల ప్రజలు జాతర కార్యక్రమంలో పలు అట వస్తులు తిలకించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటజీ మండల అధ్యక్షులు ఏశాల దత్తత్రి, బొయిడి విఠల్ వద్నామ్ నగేష్ బైంసా ఆత్మ కమిటీ చెర్మన్ సిద్ధం వివేకానంద మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్,మాజీ సర్పంచ్ విజయ్, మాజీ మాజీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ షేక్ హైమద్, మార్కెట్ డైరెక్టర్ లు దత్తు రామ్ పటిల్, అరుణ్,, ఉప అధ్యక్షులు సూది రాజన్న,ఆయా సంఘాల సంఘం అధ్యక్షులు చిమ్మన్ అరవింద్ పుప్ఫల పీరాజీ, దత్త త్రి,మండల నాయకులు దిగంబార్ పటిల్,నాగలింగం,వ్యాపార వేత్తలు సంతోష్, ఆనంద్ సాయినాథ్ రమేష్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.



