Thursday, February 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కన్నుల పండగగా విఠల్ -రుక్మిణి విగ్రహ ప్రతిష్టపన

కన్నుల పండగగా విఠల్ -రుక్మిణి విగ్రహ ప్రతిష్టపన

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని పార్డి (కే )గ్రామమలో నూతనంగా నిర్మించిన విఠల్ రుక్మిణి ఆలయం లో దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన వేద పండితులు గురువారం ముందుగా ఉదయం వెంకట స్వామి మహారాజ్ దత్త మందిర్ పిప్పల్ గారి చే కలిశా పూజ చేసి అనంతరం బొబ్బుల్ మహారాజ్ బైంసా చే గణపతి హోమ పూజ కార్యక్రమలు కన్నుల పండగగా సాగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతితి గా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, కాంగ్రెస్ పార్టీ ముధోల్ ఇంచార్జ్ నారాయణ్ రావు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టపనకు పెద్ద మొత్తంలో చుట్టు ప్రక్క ప్రజలు మహిళలు మంగళ హరతులతో భక్తి శ్రద్దాలతో ఫార్డి కే గ్రామంలో మరో పండరి పూర్ గా కొలిశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆలయనికి వచ్చిన భక్తులకు తీర్త ప్రసాదాలు, అన్నదానా కార్యక్రమాలు అందించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే లకు గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు శలవా పూల మాలతో ఘనంగా సన్మాంచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్, స్థానిక సర్పంచ్ గంగామణి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు రాములు,మాజీ ఎంపీపీ లు బోయిడి విట్టల్, నగేష్  మార్కెట్ కమిటీ చేర్మెన్ కళ్యాణ్ బైంసా ఆత్మ కమిటీ చేర్మెన్ సిద్ధం వివేకానంద,మాజీ సహకార సంఘం చైర్మన్ గంగ చరణ్ ,మండల అధ్యక్షులు ఏశాల దత్తు, శంకర్ బషీర్, సాయినాథ్, గులాబ్ చంద్రశేఖర్ పటేల్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -