Saturday, February 28, 2026
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్‌ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌

పవర్‌ఫుల్‌ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌

- Advertisement -

ప్రభాస్‌, డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో రూపొందుతున్న పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్ట్‌ ‘స్పిరిట్‌’. ఈ చిత్రంలో పవర్‌ ఫుల్‌ పాత్రతో వివేక్‌ ఒబెరాయ్‌ కనిపించబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.
ఈ నేపథ్యంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఒబెరాయ్‌ కమాండింగ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో, ఇంటెన్స్‌గా కనిపిస్తూ హై-స్టేక్స్‌ యూనివర్స్‌లో తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతుందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్‌ చేరింది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య దేశాయ్‌ను పరిచయం చేశారు మేకర్స్‌. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండనుంది. ‘యానిమల్‌’ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్‌ కుమార్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మరోసారి బోల్డ్‌ క్రియేటివ్‌ విజన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రభాస్‌కు జోడిగా తప్తి డిమ్రి కనిపించనున్నారు. భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ ఇంటెన్స్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనుంది.
8 భాషల్లో విడుదల కానున్న ఈ పాన్‌-వరల్డ్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. గుల్షన్‌ కుమార్‌ సమర్పణలో, టి-సిరీస్‌ ఫిలిమ్స్‌, భద్రకాళి పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -