- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1993_94 పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాలలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ స్వామి నాథ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



