Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్దళితులను మోసం చేస్తోంది వివేక్ కుటుంబమే..

దళితులను మోసం చేస్తోంది వివేక్ కుటుంబమే..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్, దొగ్గేల సంపత్ ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
: దళితులను మోసం చేస్తోంది గడ్డం వివేక్ కుటుంబమేని కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొగ్గేల సంపత్ ఆరోపించారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబులపై మలమహనాడు నాయకులు చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు.దుద్దిళ్ల కుటుంబం లేకపోతే గడ్డం వంశీకృష్ణ ఎంపీ అయ్యేవాడివాని ప్రశ్నించారు.మాల కుటుంబంలో ముగ్గురు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారన్నారు.పెద్దపల్లి పార్లమెంట్, చెన్నూరు,బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాల సామాజిక వర్గం కు చెందిన వారే పదవులు అనుభవిస్తున్నారు,దళితులంటే మీరేనా దళిత సామాజిక వర్గంలో వేరేవాళ్ళు లేరాని ప్రశ్నించారు.గత యాభై సంవత్సరాలుగా తాత నుండి మనువడి వరకు దళిత రిజర్వేషన్ అనుభవిస్తున్నది గడ్డం కాకా కుటుంబం కదా..  దళితులను మోసం చేసిన మొట్ట మొదటి వ్యక్తులు వివేక్ కుటుంబమేని తెలిపారు. దళితులకు ఏనాడు సాయం చేయని గడ్డం కుటుంబం  ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణని వ్యతిరేకించిన కుటుంబం వెంకటస్వామి  వివేక్ వినోదు వంశీకృష్ణ కుటుంబానికి వంతన పడుతు పబ్బం గడుపుకునే అంబేద్కర్ సంఘాలకు హెచ్చరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దుద్దిళ్ల కుటుంబంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఈనెల 22వ తారీకు రోజున కాలేశ్వరం లో పుట్ట మధు, శ్రీధర్ బాబు, సతీమణి ఐఏఎస్ అధికారిని శ్రీమతి శైలజా రామయ్యర్  పట్ల మాట్లాడిన  తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -