– కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
– డిడబ్ల్యూజేఎస్ జిల్లా అధ్యక్షులు జంగం రాజలింగం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని జిల్లాల గడ్డ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సనాదుల వివేక్ విద్యార్థి మృతి అత్యంత బాధాకరమని దళిత వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జంగం రాజలింగం అన్నారు. బుధవారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వివేక్ మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించి, ఓదార్చారు. అనంతరం పాఠశాలను సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా జోనల్ అధికారి, పాఠశాల ప్రిన్సిపల్ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ విద్యార్థి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి మృతి గల కారణాలను వెల్లడించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. మృతి చెందిన విద్యార్థి వివేక కుటుంబానికి రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూజెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్, హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షులు బోడుమల్ల సంపత్, సతీష్, జిల్లా పిఆర్ఓ నర్సయ్య, వేణులు పాల్గొన్నారు.
వివేక్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES