Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా కొనసాగిన ఒకేషనల్ బ్రిడ్జి పరీక్షలు 

ప్రశాంతంగా కొనసాగిన ఒకేషనల్ బ్రిడ్జి పరీక్షలు 

- Advertisement -

–  కామారెడ్డి జిల్లాలో 91.37 శాతం హాజరు
నవతెలంగాణ – కామారెడ్డి

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 పరీక్షలు కామారెడ్డి జిల్లాలో శనివారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయనీ ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1738 మంది విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఇవ్వగా, 1588 మంది హాజరయ్యారు. 150 మంది గైర్హాజరయ్యారు. దీంతో 91.37 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో హాజరు వివరాలు ఇలా ఉన్నాయి. జీజే బిచ్కుందా కేంద్రంలో 33 మంది విద్యార్థులు ఉండగా అందరూ హాజరయ్యారు. 

ఎల్లారెడ్డి కేంద్రంలో 4 మందికి గాను 1రు మాత్రమే హాజరయ్యారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిట్లం కేంద్రంలో 37 మందికి గాను 36 మంది హాజరయ్యారు. జీజే నిజాంసాగర్ కేంద్రంలో 34 మందికి గాను 31 మంది హాజరయ్యారు. జీజే గాంధారీ కేంద్రంలో 41 మందికి గాను 37 మంది హాజరయ్యారు.

శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ కామారెడ్డి కేంద్రంలో 528 మందికి గాను 473 మంది హాజరయ్యారు. తాగూర్ కాలేజ్ బాన్సువాడ కేంద్రంలో 331 మందికి గాను 308 మంది హాజరయ్యారు. వీఆర్‌కే జూనియర్ కాలేజ్ కామారెడ్డి కేంద్రంలో 304 మందికి గాను 270 మంది హాజరయ్యారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో-ఎడ్ బాన్సువాడ కేంద్రంలో 216 మందికి గాను 199 మంది హాజరయ్యారు. జీజే బాన్సువాడ కేంద్రంలో 210 మందికి గాను 200 మంది హాజరయ్యారు.

పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -