Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒకేషనల్‌ సెకండ్‌ స్పెల్‌ మూల్యాంకనం

ఒకేషనల్‌ సెకండ్‌ స్పెల్‌ మూల్యాంకనం

- Advertisement -

– క్యాంప్‌ డేట్‌ను మార్చి 22కు మార్చాలి
– ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి
టీజీజేఎల్‌ఏ 475 అసోసియేషన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉగాది, రంజాన్‌ పర్వదినాల దృష్ట్యా హైదరాబాద్‌ ఒకేషనల్‌ పరీక్ష పేపర్లు మూల్యాంకనం క్యాంప్‌ డేట్‌ను మార్చి 22కు మార్చాలని టీజీజేఎల్‌ఏ 475 అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఇంటర్‌ విద్య డైరెక్టర్‌, తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు ఆన్‌లైన్‌లో వినతిపత్రం పంపించినట్టు తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ (టీజీజేఎల్‌ఏ) 475 అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ వస్కుల శ్రీనివాస్‌, డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ తెలిపారు. ఈనెల 19, 21వ తేదీల్లో ఉగాది, రంజాన్‌ పండుగల దృష్ట్యా హైదరాబాదు నాంపల్లి ఎంఏఎం కళాశాలలోన 18న ప్రారంభమయ్యే ఒకేషనల్‌ సెకండ్‌ స్పెల్‌ మూల్యాంకం డేట్‌ను మార్చాలని కోరారు. ఈ ఏడాది మూల్యాంకన క్యాంపును రాష్ట్రవ్యాప్తంగా ఒక హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇక్కడికి 33 జిల్లా ఒకేషనల్‌ అధ్యాపకులు రావాల్సి ఉంటుందన్నారు. మార్చి 19న ఉగాది, మార్చి 21న రంజాన్‌ పండుగ జరుపుకుంటున్నారనీ, ఈ నేపథ్యంలో 18న హైదరాబాద్‌ వచ్చే అధ్యాపకులు ఉగాది, రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు ఇంటికి వెళ్లడానికి చాలా ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఒకేషనల్‌ పరీక్ష పేపర్లో మూల్యాంకనం సెకండ్‌ స్పెల్‌ను ఈనెల 22 నుంచి ప్రారంభిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఇతర సిబ్బంది కూడా రంజాన్‌ పండుగ వల్ల విధులకు రాకపోయే అవకాశం ఉంటుందనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని 22కు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యదర్శితో పాటు ఇంటర్‌ బోర్డు కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ జయప్రద భారుకు కూడా పంపించినట్టు తెలిపారు. బోర్డు కార్యదర్శి సానుకూల నిర్ణయం తీసుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -