Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ లో వాలీబాల్ టోర్నమెంట్

కోనాపూర్ లో వాలీబాల్ టోర్నమెంట్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని మారుమూల గ్రామమైన కోనాపూర్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ రిక్కల  అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ టోర్నమెంట్ లో పది జట్లు పాల్గొన్నాయి.వాలీబాల్  టోర్నమెంట్ విజేతగా ప్రథమ స్థానంలో నల్ల గంగాధర్ జట్టు నిలవగా, రన్నర్ గా రాజేశ్వర్ రెడ్డి జట్టు నిలిచింది. విజేత జట్లకు సర్పంచ్ అరుణ్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో పైకి ఎదగవచ్చు అన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ ను విజయవంతం చేసిన క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించిన సర్పంచ్ అరుణ్ రెడ్డికి  కోనాపూర్ వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -