Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆ గ్రామంలో స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం

ఆ గ్రామంలో స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం

- Advertisement -

విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న గ్రామసభ
నవతెలంగాణ – కృష్ణా 

ఆ గ్రామంలో స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం..నారాయణపేట జిల్లాలో గ్రామస్థులంతా కలిసి స్వచ్ఛందంగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరి స్వార్థం వారు చూసుకునే రోజుల్లో మనమే కాదు మనతో పాటు మన ఊరు కూడా బాగుండాలనే గొప్ప ఆలోచన చేశారు. గ్రామపెద్దలు గ్రామస్థుల బాగుకోసం సర్పంచ్ తో పాటు పెద్దలు గ్రామసభ పెట్టి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించాలని విప్లవాత్మక తీర్మానం చేశారు.

నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కున్సి గ్రామంలో గ్రామ పెద్దలు, మహిళలు, నాయకులు, యువజనులు, గ్రామస్థులు, సంపూర్ణ మద్యపాన నిషేధానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా నేడు మంగళవారం సర్పంచ్ మ్యకల్ సురేష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ఇకపై బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని  తీర్మానించారు. ఎవరైనా తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం అమ్మినట్లయితే జరిమానా విధించాలని.. అదేవిధంగా పాఠశాల ఆవరణ చుట్టుపక్కన కిరాణా స్టోర్ లో గుట్కా, సిగరెట్ వంటి మత్తు పదార్థాలను అమ్మకూడదని ఒక విప్లవాత్మక తీర్మానాన్ని గ్రామస్తులు చేశారు.

గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువై విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. గ్రామంలోని కొంతమంది యువకులు మద్యానికి బానిసవుతున్న కారణంగా, ప్రజలు మద్యం సేవించి వారి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారని.. అందుకే గ్రామస్తుల బాగుకోసం గ్రామంలో మద్య నిషేధం విధించడం జరిగిందని ఆ గ్రామ సర్పంచ్ మ్యకల్ సురేష్, గ్రామస్తులు తెలిపారు. ఇట్టి నిర్ణయంతో జిల్లాలోనే సంపూర్ణ మధ్య నిషేధ గ్రామంగా కున్సి గ్రామం నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -