Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాలంటీర్లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి 

వాలంటీర్లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి 

- Advertisement -

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాసరెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు

ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిగకుటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రామన్నగూడెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రామన్నగూడెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 6వ రోజున “నాయకత్వ లక్షణాలు” అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

వాలంటీర్లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, నాయకత్వం అనేది పదవితో రాదు. ఆచరణలో చూపే నిజాయితీ, సేవా తత్పరత, క్రమశిక్షణ, సమయపాలన, జట్టు భావం వంటి లక్షణాల ద్వారానే నిజమైన నాయకత్వం ఉద్భవిస్తుందని అన్నారు.  వాలంటీర్స్ లో ఈ లక్షణాలు పెంపొందితే వారు భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారు అని అన్నారు. అలాగే ఆయన మహనీయుల నాయకత్వ లక్షణాలను గుర్తుచేస్తూ, అంబేద్కర్, అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన కారణం వారి సేవా తత్పరత, కష్టసాధన, క్రమశిక్షణ అని స్పష్టం చేశారు. ప్రత్యేక శిబిరం వాలంటీర్స్ కు సామాజిక అవగాహన కలిగించడమే కాకుండా, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి గొప్ప వేదికని, చిన్న చిన్న పనుల ద్వారానే నాయకత్వం ప్రదర్శించవచ్చు.

రక్తదానం, గ్రామ శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన, మహిళా సాధికారత వంటి సేవా కార్యక్రమాల్లో వాలంటీర్స్ చురుకుగా పాల్గొనాలి అని పేర్కొన్నారు. ఈ రోజుల శిబిరంలో వాలంటీర్స్ కు సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య అవగాహన, విద్యా ప్రోత్సాహం, యువతలో క్రమశిక్షణ వంటి అంశాలపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వాలంటీర్స్ గ్రామంలో శుభ్రత కార్యక్రమాలు, మొక్కల నాటకం, సాక్షరతా కార్యక్రమాలు, యువతకు వ్యసనాలపై అవగాహన, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి మూఢనమ్మకాల నిర్మూలన, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలు, సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జంతు శాస్త్ర అధ్యాపకులు పెద్దూరి వెంకటేశ్వర్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మహేష్, నవీన్, అక్షిత , ఉపేందర్, అనిల్, నరేందర్, అఖిల్ , వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -