తెలంగాణ జాగృతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం పని చేసే అభ్యర్థులకు ఓటు వేయాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపాల్టీలను కార్పొరేషన్లలో కలపటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి చేసిందేమి లేదని కోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. పదేండ్ల బీఆర్‌ఎస్, రెండేండ్ల కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీల అభివృద్ధి కుంటుపడిందని ఆయన తెలిపారు. నవీన్ ఆచారి మాట్లాడుతూ ప్రజలకేమి చేస్తారో చెప్పకుండా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా ఫోన్ ట్యాపింగ్, సిట్ నోటీసుల పేర జనాలను పోగు చేస్తున్నారని తప్పుపట్టారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేదనీ, హైదరాబాద్‌తో పాటు, ఇతర నగరాల్లో పార్కులు, చెరువుల స్థలాలు కబ్జా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహం గుర్తుపై పోటీ చేస్తున్న జాగృతి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
పని చేసే అభ్యర్థులకు ఓటు వేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



