Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సంక్షేమం కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి 

పేదల సంక్షేమం కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి 

- Advertisement -

– దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ – తొగుట

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు తోడ్పడాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను అభ్యర్తించారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మె ల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా షేక్ పేట డివిజన్ పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గల్లి గల్లి – గడప గడప ప్రజల్లో జోరుగా ప్రచా రం నిర్వహించి ప్రజలతో ఆత్మీయంగా కలుసుకొని నవీన్ యాదవ్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కోరుతూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను అందజేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో జరుగు తున్న అభివృద్ధి పనులను వివరించారు. భవిష్య త్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరింత అందం గా నవీన్ యాదవ్ తీర్చు దిద్దుతారని ప్రజలకు భరోసా కల్పించారు. చేతి గుర్తుపై మీ అమూల్య మైన ఓటు వేసి, నవీన్ యాదవ్ ను గెలిపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాల ని కోరారు. ఇట్టి కార్యక్రమంలో దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్),నియోజకవర్గం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -