Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా ప్రభుత్వానికి ఓటెయ్యండి

ప్రజా ప్రభుత్వానికి ఓటెయ్యండి

- Advertisement -

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

నవతెలంగాణ-భీంగల్‌
ప్రజా ప్రభుత్వానికి ఓటెయ్యాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా శనివారం నిజామాబాద్‌ జిల్లాలోని భీంగల్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పురపాలక సంఘం ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ క్లిన్‌ స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇచ్చిందని, గత ప్రభుత్వ హయాంలోకంటే వరి ధాన్యం సాగు పెరిగిందని తెలిపారు.

అర్హులైన వారందరికీ తెల్లరేషన్‌ కార్డులు మంజూరు చేయడంతో ప్రజలందరూ కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారని అన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్‌ ప్రయాణంతో మహిళలు కాంగ్రెస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లిం, మైనారిటీలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలబడిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు నగేష్‌ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌ కుమార్‌, కార్పొరేషన్‌ చైర్మెన్‌లు ఈరవత్రి అనిల్‌ కుమార్‌, మానాల మోహన్‌ రెడ్డి, సుంకేట అన్వేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -