– మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
– బలగాల మధ్య ఓయూలో సీఎం పర్యటనేంటి : బీజేపీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓటు చోరీ ప్రచారం కాంగ్రెస్‌కు ఓట్లు తెచ్చిపెట్టదని బీజేపీ ఎంపీ డీకే.అరుణ ఎమ్మెల్యే పాయల్ శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, మీడియా ఇన్‌చార్జి ఎన్‌వీ.సుభాష్ చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో, పలుచోట్ల మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజరుపై మహేశ్‌గౌడ్ చేసిన వ్యక్తిగత విమర్శలను తప్పుబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే ఈసీ బాగుంటుంది..ఓడితే చెడ్డదవుతుంది..ఇదేం ద్వంద వైఖరి అని ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్లను ఏరేయాలని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బోగస్ ఓట్ల గుట్టు విప్పాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి మతిభ్రమించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పోలీసు పహారా మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం వెళ్లడాన్ని తప్పుబట్టారు. యూనివర్సిటీకి వెళ్లడానికి ఎందుకు అంత భయం అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. గతంలో ఓయూకి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారనీ, ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఇస్తానని రేవంత్‌రెడ్డి కూడా మోసం చేయబోతున్నారని విమర్శించారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వర్సిట్లోని ఖాళీలను భర్తీ చేయాలనీ, రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఓటుచోరీ కాంగ్రెస్‌కు ఓట్లు తెచ్చిపెట్టదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES