Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంఓటర్‌ అధికార్‌ యాత్ర..అఖిలేష్‌ యాదవ్ రాక‌

ఓటర్‌ అధికార్‌ యాత్ర..అఖిలేష్‌ యాదవ్ రాక‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఓటర్‌ అధికార్‌ యాత్రలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొననున్నారు. ఈరోజు బీహార్‌లోని సరన్‌లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్‌ వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి జరుగుతున్న ఈ చారిత్రక ఉద్యమంలో భాగస్వాములవుతున్న అఖిలేష్‌కి ఇండియా బ్లాక్‌ నేతలు సాదర స్వాగతం పలికారు.

కాగా, నేడు ఓటర్‌ అధికార్‌ యాత్రలో అఖిలేష్‌జీ చేరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి జరుగుతున్న ఈ చారిత్రక ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు స్వాగతం. బిజెపి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అఖిలేష్‌ మాకు బలమైన మిత్రుడు. ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా పేదలు, అణగారిన వర్గాల గొంతుకగా అఖిలేష్‌ ఉంటారు’ అని కెసి వేణుగోపాల్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ఈ యాత్ర సెప్టెంబర్‌ 1న ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -