Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అస్తవ్యస్తంగా ఓటరు జాబితా 

అస్తవ్యస్తంగా ఓటరు జాబితా 

- Advertisement -

ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ఓటర్ల బదిలీ 
వార్డుల వేరుతో ఓటర్ల ఆవేదన 
ప్రజలకు ఆమోదయోగ్యంగా ఓటర్ జాబితా ఉండాలి 
రేపు సవరణకు అవకాశం : ఎంపీడీవో
నవతెలంగాణ – పాలకుర్తి

శాసనసభ, పార్లమెంటు ఎన్నికల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు తయారుచేసిన ఓటరు జాబితా అస్తవ్యస్తంగా మారిందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముస్తాబవుతున్న సందర్భంలో ఎన్నికల జాబితా పట్ల సవరణలు తెలియజేసేందుకు మూడు రోజులపాటు గ్రామపంచాయతీల వద్ద ఓటర్ జాబితాను పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం ప్రదర్శించారు. ఓటరు జాబితాను ప్రదర్శించడంతో జాబితాను చూసిన ఓటర్లు దూలన చెందారు. మండలంలోని అయ్యంగారి పల్లి గ్రామానికి చెందిన 41 మంది ఓటర్లలో 13 మంది పెద్దతండ బి హోటల్ జాబితాలో, 28 మంది బమ్మెర ఓటరు జాబితాలో ఉండడం పట్ల ఓటర్లు నిరాశ చెందారు. శాతాపురం గ్రామంలో ఓటర్లను వార్డులకు సంబంధం లేకుండా ఇతర వార్డులలో ఓటర్ జాబితాలో ఓటరుగా నమోదు కావడంతో ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధం లేని వార్డుల్లో ఓటరుగా గుర్తించారని ఆరోపించారు. పాత విధానాన్ని అవలంబించి ఓటరు జాబితాలో యధావిధిగా ఓటరుగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన ఓటరు జాబితా ఉండాలని ప్రజలు తెలిపారు. 

రేపు సవరణకు అవకాశం: ఎంపీడీవో రవీందర్ 

గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించిన ఓటరు జాబితాలో సవరణ కోసం నేడు అవకాశం కల్పించామని ఎంపీడీవో రవీందర్ తెలిపారు. ఓటర్ జాబితా పట్ల ప్రజలు ఎలాంటి అపోహలక గురికాకూడదు అని తెలిపారు. ఓటరు జాబితాలోని ఓటరుగా సవరించుకునేందుకు నేడు సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటరు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సవరించిన ఓటరు జాబితాను మళ్ళీ గ్రామాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. అయ్యంగారి పల్లి ఓటరు జాబితా పై బమ్మెర ఓటర్ జాబితాలో ఉన్న డబ్బులు పేర్లను తొలగించేందుకు తహసిల్దార్ కు  ఫిర్యాదు చేశామని తెలిపారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకు 1000 ఓటర్లకు ఒక బూతు ఉంటుందని, స్థానిక సంస్థలకు వంద నుండి 700 ఓటర్లకు ఒక వార్డు ఉంటుందని తెలిపారు. వార్డుల వల్ల ఓటరు జాబితాలో పేర్లు అటు ఇటుగా తొలగిపోతాయని తెలిపారు. సవరణకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad