Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ తో ఓటర్ జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్ 

ఎస్ఐఆర్ తో ఓటర్ జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్ తో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలసి వీసిలో పాల్గోన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్ లో భాగంగా 2002 ఓటర్ జాబితాతో 2025 ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో ఇంకా వేగం పెరగాలని చెప్పారు. వేగంగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రతి బిఎల్ఓ తో రోజుకి 30 ఎంట్రీ లు టార్గెట్గా మ్యాపింగ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్.ఐ.ఆర్ 2002 ను ఎస్.ఎస్.ఆర్ 2025 లింకేజీ ప్రక్రియ, అదేవిధంగా 2002 ఓటర్లతో వారి కుటుంబ సభ్యుల లింకేజీ ప్రక్రియ సైతం బూత్ స్థాయి అధికారులతో వేగవంతంగా పూర్తి చేయించాలని అన్నారు. 

వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్ తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వనపర్తి లో మొత్తంగా ఇప్పటివరకు 65.94 శాతం పూర్తి చేశారని, ప్రక్రియను మరింత వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ముఖ్యంగా వనపర్తి మండలంలో మ్యాపింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహసిల్దార్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -