- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలంగాణలో మూడో విడత ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-సర్) నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో వెయ్యి మందికి పైగా బూత్‌స్థాయి అధికారులతో(బీఎల్‌వోలు) కీలక సమావేశం నిర్వహించనున్నారు. ‘సర్’ నిర్వహణపై వారికి సూచనలు, సలహాలతోపాటు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.
- Advertisement -



