ట్రంప్ యోచన
సెనెట్‌లో నిలిచిన బిల్లు
వాషింగ్టన్ : ఓ వైపు ఇరాన్‌పై యుద్ధం…మరో వైపు ఈ ఏడాది నవంబరులో జరగాల్సిన మధ్యంతర ఎన్నికలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చవుతోంది. ఇంటా బయటా విమర్శలు సరేసరి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. మన దేశంలో అమలు జరుగుతున్న ‘సర్’ ప్రక్రియ తరహాలోనే అక్కడ కూడా ఓటర్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఆయన యోచిస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఎన్నికలలో సమగ్రతను, కచ్చితత్వాన్ని కాపాడడం దేశ ప్రాధాన్యతగా ఉన్నదని ఆయన వాదిస్తున్నారు. డూప్లికేట్ లేదా అనర్హులను ఏరివేసేందుకు ఓటరు పరిశీలన ప్రక్రియను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల జాబితాలను తరచుగా సమీక్షించాలని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని, ఎన్నికలలో అవకతవకలకు అవకాశం ఉండదని చెప్పారు. కాగా ప్రతి ఓటరూ తన పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందంటూ ప్రతిపాదించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే అది సెనెట్‌లో నిలిచిపోయింది. ట్రంప్ సూచిస్తున్న ఎన్నికల సంస్కరణలపై అమెరికాలోని రాజకీయ పరిశీలకులు, శాసనకర్తలలో చర్చ మొదలైంది. కఠిన నిబంధనలు విధిస్తే ఓటర్లు ఎన్నికల ప్రక్రియకు దూరమవుతారని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే శాసనపరమైన చర్యలు అవసరమవుతాయని, ఫెడరల్ అధికారులు-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
‘సర్’ తరహాలో ఓటర్ల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



