నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆ గ్రామ బి ఎల్ ఓ లు పెరుమాండ్ల శ్రీ జ్యోతి దాసరి కవిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని రంగురంగుల ముగ్గులు వేసి ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య పాల్గొని వారు మాట్లాడుతూ ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని మనం ప్రతి ఓటరు దరుడు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటు హక్కును భయభ్రాంతులకు గురికాకుండా గ్రామంలో ఓటు వేసుకునే అధికారం ఉందని అన్నారు. గ్రామంలో ఓటరు దారులతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జల్లా పరశురాములు, వివో ఏ ఉష, ఆశ వర్కర్ రేణుక నాయకులు తాళ్ల యాకన్న అజీమ్ ఉమేష్ పిట్టల యాకన్న గ్రామస్తులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ కొత్త పల్లిలో ఘనంగా ఓటర్ల దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



