Friday, January 23, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఓటర్స్ డే

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఓటర్స్ డే

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఓటర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న మాట్లాడుతూ ఓటు అభివృద్ధికి జీవనాడి అని తెలియజేస్తూ ఓటు ప్రాముఖ్యతలను విద్యార్థులకు వివరించారు. ఓటు విలువ, ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అనంతరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కిషన్ విద్యార్థులను ఒక క్రమ అమరిక ద్వారా అక్షరాల కృతిలో కూర్చోబెట్టారు.

ప్రజాస్వామ్యం దేశానికి ప్రాణవాయువు లాంటిదని సూచించే విధంగా ఓ..టు అక్షర కృతిని విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులతో ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిరిమల్ల దేవన్న, మహి కాంత్, శ్రీనివాస్, రవీందర్, గోపాల్, చంద్రకళ, శ్రావణి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, శిరీష, సుమలత, గ్రామపంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి రాఘవేందర్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -