Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటర్లు డబ్బుకు, మద్యానికి లోను కావొద్దు: కలెక్టర్

ఓటర్లు డబ్బుకు, మద్యానికి లోను కావొద్దు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఓటర్లు తమ ఓటు హక్కును డబ్బుకు, మద్యానికి, తదితర వసతులకు లోబడకుండా సరైన నాయకులను ఎంచుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓటర్లకు సూచించారు. మంగళవారం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత ఎన్నికలు జరగనున్న వలిగొండ మండల కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  స్వీప్ 2025 ఓటర్ అవగాహన, చైతన్య కార్యక్రమంలో  జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్ హాజరై, మాట్లాడారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికలు డబ్బులు, మద్యానికి , బిర్యాని ప్యాకెట్ లకు, ఇతర కానుకలకి కాకుండా స్వచంధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ఇటీవల బొమ్మలరామారం మండలంలో  ఈ అవగాహన కార్యక్రమం చేపట్టిన తర్వాత జలాల్ పూర్ గ్రామస్థులు స్వచంధంగా వాళ్ళ ఇండ్ల ముందు మద్యానికి, డబ్బులకు ఓటును అమ్ముకొము అని బోర్డులు ఏర్పాటు చేశారని తెలిపారు.మీరు కూడా మండలంలో మీ గ్రామంలో కూడా మా ఓటు ని అమ్ముకోము స్వచ్ఛందంగా ఓటుని వినియోగించుకుంటాం అని బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ మార్పు అనేది ఎవరో ఒకరి  దగ్గరంనుండి అని కాకుండా  నా ఇంటి నుండి మొదలు అవ్వాలని అనుకోవాలని తెలిపారు.ఒక మంచి నాయకులను ఎన్నుకుంటే రానున్న 5 సంవత్సరాలలో మీ గ్రామ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు.గ్రామ ఓటర్లు అవగాహన కార్యక్రమాలకు స్పందించి తమ ఓటును గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేసే నాయకులను ఎంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -