Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓటు వేసే హక్కు కోసం ఓటర్ల ధర్నా

ఓటు వేసే హక్కు కోసం ఓటర్ల ధర్నా

- Advertisement -

– ఏకగ్రీవాన్ని వ్యతిరేకిస్తూ చౌటుప్పల్‌ పట్టణంలో నిరసన
– విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్‌

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట 17వ వార్డు ఓటర్లు బుధవారం ఆందోళనకు దిగారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ 17వ వార్డులో పోటీలో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆ వార్డు ఏకగ్రీవమైంది. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఓటర్లు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ‘మా ఓటు.. మా హక్కు. మేము ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉండాలి.. అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారనే కారణంతో మాకు ఓటు హక్కు లేకపోవడం అన్యాయం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు మాట్లాడుతూ.. ఏకగ్రీవం పేరుతో ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు. ‘మాకు’ ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందన్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఓటర్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఉపసంహరించుకున్నప్పుడు ఏకగ్రీవం చెల్లుబాటు అవుతుందని అధికారులు వివరించినప్పటికీ ఓటర్లు నిరసన కొనసాగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -