Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంముమ్మ‌రంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

ముమ్మ‌రంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పార్లమెంట్ హౌస్‌లో ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది. ఇక కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇక ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ.రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభలో 543 మంది ఎంపీలు ఉండగా.. రాజ్యసభలో 233 మంది సభ్యులు ఉన్నారు. ఇక 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉండగా.. 5 రాజ్యసభ, 1 లోక్‌సభ స్థానం ఖాళీగా ఉంది. మొత్తం 781 మంది ఎంపీలు ఓటులో పాల్గొననున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేడీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. అలాగే పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ (SAD) కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -