Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఓటమి భయంతోనే బీహార్ లో ఓట్ల తొలగింపు..

ఓటమి భయంతోనే బీహార్ లో ఓట్ల తొలగింపు..

- Advertisement -

ప్రతిపక్ష, మైనారిటీ ఓటర్లే బీజేపీ టార్గెట్: సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సింగిరెడ్డి నవీన 
నవతెలంగాణ – దుబ్బాక

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష, మైనార్టీ ఓటర్లనే టార్గెట్ చేస్తూ.. బీహార్ లో ప్రక్షాళన పేరిట అప్రజాస్వామికంగా 65 లక్షల ఓట్లను తొలగించే దుశ్చర్యకు పాల్పడుతుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సింగిరెడ్డి నవీన విమర్శించారు. ఓటమి భయంతోనే బీహార్ లోని ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లను తొలగించే దిశగా కేంద్ర సర్కార్ పావులు కదుపుతుందని, ఇది ఎన్డీఏ కూటమి మళ్లీ గెలిచేందుకు పన్నిన కుట్రలో భాగమేనని నొక్కి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం దుబ్బాకలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించి మాట్లాడారు. దేశంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ప్రయోజనాలు అందకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మతతత్వ సిద్ధాంతాల్ని అవలంబిస్తుందని,  కొంతమందికే రాజ్యాంగ ప్రయోజనాలు దక్కాలన్న అక్కసుతో కేంద్ర సర్కార్ ఈ తీరుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ విధానాల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగ, ఆర్థిక ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఓట్ల తొలగింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) మండల నాయకులు దినేష్, ప్రశాంత్ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad