Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుక్రిస్మస్‌ బరిలో 'వృషభ'

క్రిస్మస్‌ బరిలో ‘వృషభ’

- Advertisement -

మోహన్‌లాల్‌ నటిస్తున్న చిత్రం ‘వృషభ’. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. మలయాళం, తెలుగులో ఒకే సమయంలో చిత్రీకరించారు. హిందీ, కన్నడలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ‘తండ్రీ కొడుకుల మధ్య అందమైన, గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేమ, విధి, ద్వేషం వంటి ఎమోషన్స్‌ని సమర్థవంతంగా డీల్‌ చేసిన సినిమా ఇది. నందకిశోర్‌ రచన, దర్శకత్వం ప్రేక్షకులను మైస్మరైజ్‌ చేస్తుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న లాల్‌ ఏట్టన్‌ అభిమానులకు, మూవీ లవర్స్‌కి కన్నులపండువగా ఈ చిత్రం ఉంటుంది. క్రిస్మస్‌ బరిలో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నామనే విషయాన్ని మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసి అనౌన్స్‌ చేశారు నిర్మాతలు. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్‌, అభిషేక్‌.యస్‌ సమర్పిస్తున్నారు. వ్యాస్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సి.కె.పద్మకుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌ సింగ్‌, విశాల్‌ గుర్ణని, జుహి పరేఖ్‌ మెహతా నిర్మిస్తున్నారు. విమల్‌ లహోటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -