మోహన్ లాల్ నటిస్తున్న నయా మూవీ ‘వృషభ’. ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25న ఈ సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమల్ లహౌటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను దర్శకుడు నందకిషోర్ మలయాళం, తెలుగులో రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్‌లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఈ సినిమాలో ముఖ్యతారాగణం.
‘వృషభ’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



