నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి చేస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ చిత్రాన్ని ఎస్‌విసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్‌లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. గ్లింప్స్ వృషకర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్నీక్ పీక్ ఇవ్వడానికి మార్చి 5న విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగ చైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుండి దూసుకు వస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ పాత్ర కోసం నాగ చైతన్య మ్యాసీవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. రా, రగ్గడ్ లుక్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, అనేక థ్రిల్లింగ్ స్టంట్స్‌ను స్వయంగా చేస్తున్నారు. దర్శకుడు కార్తిక్ దండు తన బ్లాక్‌బస్టర్ డెబ్యూ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ చిత్రాన్ని మరింత ఇమర్సివ్‌గా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ దండు, నిర్మాతలు: బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, సినిమాటోగ్రాఫర్: రాగుల్ డి హెరియన్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘వృషకర్మ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



