Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు అసెంబ్లీలో వీవీపీ బిల్లు

నేడు అసెంబ్లీలో వీవీపీ బిల్లు

- Advertisement -

బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వార్షిక నివేదిక ప్రతిపాదన
అపాయింట్‌మెంట్లు, సిబ్బంది హేతుబద్ధీకరణ బిల్లు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రెండు రోజుల విరామానంతరం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఆరంభమయ్యే సభలో స్పీకర్‌ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. అత్యంత కీలకమైన తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (వీవీపీ) బిల్లు సభ ముందుకు రానుంది. ప్రశ్నోత్తరాల్లో పురపాలక, పట్టణాభివృద్ధి, రవాణా, రోడ్లు, భవనాలు, ఎస్సీల అభివృద్ధి, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం, విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, హోం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన వివిధ అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు.

అనంతరం రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన వార్షిక నివేదిక(2018-19)ను మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌గా మార్చిన నేపథ్యంలో సంబంధిత బిల్లును వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వ ఉద్యోగుల అపాయింట్‌మెంట్లు, సిబ్బంది హేతుబద్దీకరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చను స్పీకర్‌ ప్రారంభిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -