Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైడ్రాలో వేతనాలు తగ్గడం లేదు..

హైడ్రాలో వేతనాలు తగ్గడం లేదు..

- Advertisement -

– పాత వేతనాలే ఇస్తామన్న హైడ్రా
– సర్దుబాటు చర్యల్లో జాప్యం వల్లే ఆందోళన
– కమిషనర్‌ హామీతో విధులకు హాజరైన ఉద్యోగులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైడ్రాలో ఔట్‌సోర్సింగ్‌ (ఒప్పంద కార్మికులు) ద్వారా పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు ఏమీ తగ్గడం లేదని బుధవారం హైడ్రా స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 1272 ప్రకారం జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం ద్వారా హైడ్రాకు సమకూరిన ఉద్యోగుల వేతనాలు రాష్ట్రంలోని వేరే డిపార్ట్‌మెంట్స్‌లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలకు సమానంగా సవరించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి హైడ్రా తీసుకెళ్లింది. ఆ వ్యత్యాసం మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ నుంచి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా అందజేయాలని ప్రభుత్వం సూచించింది. ఆ మ్యాచింగ్‌ ఫండ్‌తో మొత్తం వేతనం చెల్లించడానికి హైడ్రా ప్రయత్నించింది. అయితే ఆ మ్యాచింగ్‌ ఫండ్‌ రావడం ఆలస్యం అయ్యింది. స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తర్వాత మ్యాచింగ్‌ ఫండ్‌ విడుదల చేస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఉద్యోగులు వేతనాలు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జీవో 1272 ప్రకారం వెంటనే హైడ్రా చెల్లించింది. వ్యత్యాసం మొత్తాన్ని త్వరలో సర్దుబాటు చేస్తామని కూడా చెప్పింది. అయితే కొంతమంది ఉద్యోగులు వేతనాలు తగ్గినట్టు భావించి బుధవారం ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఉద్యోగులతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ చర్చలు జరిపారు. వేతనాలు తగ్గవని, జీహెచ్‌ఎంసీ నుంచి మ్యాచింగ్‌ గ్రాంట్‌ రిలీజ్‌ అవ్వగానే సర్దుబాటు చేస్తామని హామీ ఇవ్వడంతో హైడ్రాలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన విరమించి విధుల్లో చేరారు. వారికి జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎంలో భాగంగా ఉన్నప్పుడు అందిన వేతనాలే ఇప్పుడూ చెల్లిస్తామని హైడ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -