Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెంచాలి

కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెంచాలి

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలను పెంచి న్యాయం చేయాలని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యా లయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం కోఠిలోని మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు మహేందర్, ప్రశాంత్, శేఖర్ లు మాట్లాడుతూ.. వర్సిటీలో ఎన్నో ఏళ్ళు గా కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తున్న భోధనేతర సిబ్బంది పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతమని అన్నారు. సమాజంలో నిత్యం నిత్యావసర సరుకుల ధరలు, ఫీజులు పెరుగుతున్నా తమ వేతనాలు మాత్రం ఇంకా పెరుగడం లేదని వారు వాపోయారు. చాలీ చాలని జీతాలతో బతుకులను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలను పెంచాల ని పలు మార్లు మాజీ వీసీని అడిగినా ప్రయోజనం లేకపోవడంతో, ప్రస్తుత వీసీని అడిగామని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరన్నర కాలం

లో సుమారు 70 మందిని నూతనంగా నియమించి 30 వేల రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తున్నట్టు తమకు తెలిసిందన్నారు. ఏళ్ళ తరబడి కాంట్రాక్ట్ పద్దతిన పని చేస్తున్న భోధనేతర సిబ్బందికి మాత్రం 12 వేల రూపాయలు, నూతనం గా నియమితులైన వారికి మాత్రం 30 వేల రూపాయల వరకు జీతాలు అందిస్తున్నారన్న విషయంపై అధికారులను అడిగితే తక్కువ జీతానికి ఎవరు చేస్తారని అందుకే అధికంగా చెల్లిస్తున్నామని తెలుపుతున్నార ని వారు వాపోయారు. ఎన్నో ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రార్డ్ పద్ధతిన పనిచేస్తున్న 170 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ వేతనాలు పెంచా లని కోరినా, ప్రశ్నించినా తమను బెదిరింపులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -