Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచి పెర్మనెంట్ చేయాలి

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచి పెర్మనెంట్ చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని, ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సు పిలుపుమేరకు అక్టోబర్ 6 తేదీన జిల్లా కలెక్టర్  ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయాలని పిలుపుని జయప్రదం  చేయాలని శనివారం తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. పడిగల్ గ్రామంలోని  సాకలి అయిలమ్మ విగ్రహం వద్ద పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను పెంచి పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తారీఖున సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన, నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని ఆదేశముగా భావించి దేశంలో అమలుకు పూనుకోవాలి. అని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక భావనతో, ఉండటం వల్లనే కార్మికుల శ్రేయస్సు విస్మరిస్తోందని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగంగా వేలం వేస్తూ, మరో దిక్కు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మరణ శాసనం విధిస్తోందని ఆయన తెలిపారు.

అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కార్మిక వ్యతిరేక లేబర్ కోట్లను అమలు చేయమని తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 6 న జరిగే కార్యక్రమాన్ని జిపి , మున్సిపల్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా దాసు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) వేల్పూర్ మండల కమిటీ అధ్యక్షులు నరాటి లక్ష్మణ్, బండి పోశన్న, లింగన్న, అర్గుల పోషన్న ,పి బాబన్న, అర్గుల రాజు, గంగ ముత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -