పీఆర్టీయూ తెలంగాణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేజీబీవీ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులకు పీఏబీలో కేంద్రాన్ని కోరుతూ ఎంటీఎస్ ప్రతిపాదనను పంపిస్తూ, సమ్మెకాలం (28 రోజులు) వేతనం ఇప్పించాలని పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు జి.హర్షవర్థన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎం.చెన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రత్నాకర్ రావు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు విన్నవించారు. సమ్మె విరమణ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం వేతనం ఇస్తామన్న హామీని నిలెబట్టుకోవాలని వారు కోరారు.
ఎంటీఎస్ వచ్చే వరకు వంద శాతం వేతనాలు పెంచేలా పీఏబీలో ప్రతిపాదన పంపాలని వారు కోరారు. పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల (పీటీఐ)కు పేరు మార్చాలనీ, 10 నెలలకు బదులుగా 12 నెలల పాటు ఆటో రెన్యూవల్ చేయాలని కోరారు. కేజీబీవీల్లో నైట్ డ్యూటీ చేసిన వారిని ఉదయం 9 గంటలకే రిలీవ్ చేయాలనీ, కేర్ టేకర్లుగా టెట్ అర్హత ఉన్న నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనీ, సీఆర్టీలకు 10వ తరగతి, పీజీసీఆర్టీలకు ఇంటర్ మూల్యాంకనానికి అవకాశం కల్పించాలని వారు కోరారు.
సమ్మె కాలం వేతనం ఇప్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



