- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
బహుజనులకు బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందర్న గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ నేడు రాష్ట్ర ఈసీ నెంబర్ నీరెడీ ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు సింగాడే పాండు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివేసు సంతోష్, అసెంబ్లీ కన్వీనర్ నీరేడి రవి, బోధన పట్టణ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ గార్ల ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనను సాలుర బి.ఎస్.పి మండల అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు బోధన్ నియోజక వర్గం అసెంబ్లీ అధ్యక్షులు దాడి రమేష్ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -