Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండీఓపీటీ అనుమతి కోసం వెయిటింగ్‌

డీఓపీటీ అనుమతి కోసం వెయిటింగ్‌

- Advertisement -

అరవింద్‌ కుమార్‌ విచారణకు ఇంకా రాని క్లియరెన్స్‌
వేచి చూస్తున్న ఏసీబీ అధికారులు : కేంద్రమంత్రి బండి సంజయ్‌ శాఖ పరిధిలోనే డీఓపీటీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో నిందితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌పై చార్జిషీటు వేయడానికి కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) ఇంకా అనుమతివ్వలేదు. గత కొద్ది రోజుల క్రితమే ఈ కేసులో రెండో నిందితుడైన అరవింద్‌కుమార్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి అనుమతివ్వాలని కోరుతూ రెండు మార్లు రాష్ట్ర ఏసీబీ అధికారులు డీఓపీటీకి లేఖ రాశారు. దేశానికి చెందిన సివిల్‌ సర్వీస్‌ అధికారులలో ఎవరైనా నేరానికి పాల్పడితే వారిని ప్రాసిక్యూట్‌ చేయడానికి కేంద్ర హౌం శాఖ పరిధిలోని డీఓపీటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకపక్క ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చటమేగాక ఆయనను ప్రాసిక్యూట్‌ చేయడానికి రాష్ట్ర గవర్నర్‌ అనుమతిని కూడా ఏసీబీ తీసుకున్నది. కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్‌ను కలిపి విచారించి, ప్రాసిక్యూట్‌ చేయా లని భావిస్తున్న ఏసీబీ అధికారులు అందుకు అవసరమైన డీఓపీటీ ఆదేశాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్‌తో పాటు ఫార్ములా ఈ- కార్‌ రేసింగ్‌ కేసులను కట్టుదిట్టంగా దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్న కేంద్ర హౌం శాఖ సహాయమంత్రి బండి సంజరు పరిధిలోనే డీఓపీటీ ఉందనీ, మరి అరవింద్‌ కుమార్‌ను ప్రాసిక్యూట్‌ చేయడంలో ఈ విభాగం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావటం లేదని ఏసీబీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -