Thursday, October 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎనిమిదేండ్లుగా ఎదురుచూపులే?

ఎనిమిదేండ్లుగా ఎదురుచూపులే?

- Advertisement -

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులు పరిహారం కోసం ఏండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన తొలినాళ్లలో నాటి రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రాజెక్టుగా పెన్‌గంగ నదిపై చనాకా-కోర్ట గ్రామాల మధ్యన బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. ఇక్కడ కేవలం 0.8 టీఎంసీల నీరే నిల్వ ఉంటుంది. వర్షాకాలంలో ఐదు టీఎంసీల పైబడి వచ్చే నీటిని సద్విని యోగం చేసుకువడానికి ఎగువనున్న భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి గ్రామ సమీపంలో 1200 ఎకరాల్లో 1.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ పనులు చేపట్టింది. ఇందుకోసం 180 ఎకరాల విస్తీర్ణంలో 4.2 కి.మీ పొడవుతో కరకట్ట నిర్మాణం చేపట్టింది.

కాల్వల నిర్మాణం, నీటి నిల్వ కోసమని మరో వెయ్యి ఎకరాలు సేకరణకు పూనుకున్నది. అధికారులు రైతులతో కలిసి సమావేశాలు నిర్వహించారు.2018 సంవత్సరం అనగా ఎనిమిదేండ్ల క్రితమే ఎకరాకు రూ.8లక్షలు చెల్లిస్తామని చెప్పారు. కరకట్ట నిర్మాణం కోసం తీసుకున్న భూములకు ఎకరాకు ఎనిమిది లక్షలు చెలించారు. నిర్మాణ పనులు చేపట్టారు. కానీ మిగిలిన వెయ్యి ఎకరాలకు నష్టపరిహారమివ్వలేదు. ఎనిమిదేండ్లుగా రైతులకు ఎదురుచూపులే మిగిలాయి తప్ప పరిహారం అందలేదు. తొమ్మిదినెలల్లో రిజర్వాయర్‌ పనులు పూర్తి చేస్తా మన్న ప్రభుత్వం తొంబై నెలలు గడిచినా పూర్తి చేయలేదు.

అప్పుల పాలైన అన్నదాతలు
నష్టపరిహారం వస్తుందన్న నమ్మకంతో వడ్డీలకు అప్పులు తెచ్చి కొంతమంది ఆడబిడ్డల పెండ్లిళ్లు చేశారు. మరికొంత మంది వేరేచోట భూములు కొన్నారు. ఇంకొంత మంది గృహాలు నిర్మించుకున్నారు. ఇతర ఇంటి అవస రాలకు అప్పులు చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక అరిగోస పడుతున్నారు. పరిహారం కోసం తపించి నలుగురు రైతులు తనువు చాలించారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి కనికరం లేదు. 2013 చట్టం ప్రతి ఒక్కరికీ పరిహారం, పునరావాసం కల్పించాలని తెలియజేస్తుంది. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు సామాజిక ప్రభావ అంచనా (ఎస్‌ఐఎ) సర్వే తప్పనిసరి చేసింది. భూమిని సేకరించడానికి నిర్దిష్ట కాల పరిమితులను విధించింది.

ఇలా, ఈ చట్టం భూసేకరణ ప్రక్రియను మెరుగు పరచడానికి, భూయజమానులు, ప్రభావిత వ్యక్తులకు న్యాయం చేయడానికి ఉద్దేశించబడింది. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తుంగలో తొక్కింది. రైతులకు కేవలం రూ.8లక్షలు చొప్పున నష్టపరిహారం నిర్ణయించింది. ఆమాట మీద కూడా నిలబడకుండా జీవో 120ని తీసుకొచ్చి నష్టపరిహారాన్ని రూ.7.8 లక్షలకు కుదించింది. భూమి విలువ పెరుగుతూ వస్తుంది నష్టపరిహారాన్ని పెంచాల్సింది పోయి ఇస్తామన్న పరిహారాన్ని తగ్గిస్తూ జీవో 120 తీసు కు వచ్చింది.దీంతో రైతులు గత్యంతరం లేక పోరుబాట పట్టారు. 1200 ఎకరాల భూమి కోల్పోతుంటే కనీసం 500 మంది వ్యవసాయ కూలీలకు నష్టం వాటిల్లుతుంది. వారికీ సహకారం గురించి ప్రభుత్వం కనీసం ఊసెత్తడంలేదు.

పోరుబాటలో రైతులు
ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం ఇవ్వకపోవడం, పైగా నష్టపరిహారాన్ని తగ్గిస్తూ జీవో120 తీసుకు రావడాన్ని జీర్ణించుకోలేని రైతులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. గత మూడేండ్ల క్రితం భూనిర్వాసిత రైతులు రిజర్వాయర్‌ పనులు జరుగుతున్న చోట టెంట్‌ వేసి నెల రోజుల పాటు రిలేదీక్షలు చేపట్టారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నష్టపరిహారం సరైన సమయంలో చెల్లించనందున, భూమి విలువ మూడిం తలు పెరిగినందున ఎకరాకు రూ.18లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయినా నాటి ప్రభు త్వంలో స్పందన రాలేదు.

నాటి సీఎంఓ స్మితా సబర్వాల్‌ చనాకా-కోర్ట బ్యారేజి సందర్శించినప్పుడు నిర్వాసిత రైతులు నిరసన తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయింది. రైతులు పిప్పల్‌కోటి నుండి ఆదిలాబాద్‌ వరకు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి నాటి కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. నెలరోజుల్లో నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన కలెక్టర్‌ ఆ విషయాన్ని మరిచిపోయారు. మళ్లీ రైతులకు ఎదురు చూపులే మిగిలాయి.

మలిదశ పోరాటానికి సిద్ధం
భూనిర్వాసితుల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీపీఐ(ఎం) మలిదశ పోరాటానికి రైతులను సిద్ధం చేసింది. కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. రైతులతో పాటు మద్దతుగా గ్రామస్తుల సంతకాలు సేకరించి కలెక్టర్‌కు అందించింది. ప్రస్తుత కలెక్టర్‌ దృష్టిలో లేకున్నా ఆయన దృష్టికి తీసుకెళ్లింది. రైతులకు మనోధైర్యా న్ని కల్పించి పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి రాష్ట్ర, జిల్లా నాయకత్వం సెప్టెంబర్‌ 27న గ్రామాన్ని, రిజర్వాయర్‌ను సందర్శించింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌ రైతులను కలిసి మాట్లాడి వారికి భరోసానిచ్చారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర రాజధాని వరకైనా తీసుకెళ్తామని చెప్పారు. నాటి పోరాట సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేటి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క రైతు నాయకులకు ఫోన్‌ చేసి ‘మేము అధికారంలోకి వస్తే సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని’ హామీనిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది.

దర్శనాల మల్లేష్‌
8500700333

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -