Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ రిజర్వేషన్ల సాధనకు 16న వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమం..

బీసీ రిజర్వేషన్ల సాధనకు 16న వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమం..

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 
బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను కల్పించాలనని రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ అష్టాదశ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా  జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ నాయకత్వలో ఆదివారం రోజు వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమనికి పిలుపునిచ్చారు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు ఈ ఆదివారం నాడు 16వ తేదీ నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఉదయం ఏడు గంటలకు వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విన్నపం చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బస్సు ఆంజనేయులు  మాట్లాడుతూ.. ఈ వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో బీసీలతో పాటు బహుజన బిడ్డలు, వాకర్స్ అసోసియేషన్ అందరు కూడా పాల్గొని తమ మద్దతును తెలపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కరిపె రవిందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్ చంద్రకాంత్, ఆర్టీసీ నర్సయ్య, బాలన్న నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -