Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంవన్నాప్ సెవెంటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి: రైతుసంఘం నాయకులు పుల్లయ్య

వన్నాప్ సెవెంటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి: రైతుసంఘం నాయకులు పుల్లయ్య

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన వాక్కులను కాపాడే వన్నాప్ సెవెంటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసినప్పుడు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి సార్ధకత అని పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అభిప్రాయపడ్డారు.

టీఏజీఎస్ (తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం) ఆద్వర్యంలో,ఆ సంఘం మండల అధ్యక్షకార్యదర్శులు సోడెం ప్రసాద్,మడకం గోవిందరావు నేతృత్వంలో శనివారం మండలంలోని పండువారిగూడెం లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ 1/70 అమలు ఉన్న అటవీ ప్రాంతంలో గిరిజనేతరులకు దొడ్డి దారిలో పట్టాలు ఇస్తున్న పాలకులు,వారికి సహకరిస్తున్న ఇతర గిరిజన ప్రజాప్రతినిధులు అర్హులైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

అటవీ ప్రాంతంలో గిరిజనుల కు వారసత్వ పట్టాలు ఇవ్వడానికి సైతం నానా యాగీ చేస్తున్న రెవిన్యూ సిబ్బంది గిరిజనేతరులకు మాత్రం ఏకంగా హక్కు పత్రాల ఇచ్చేస్తున్నారు అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.చిరంజీవి అధికారులు పై మండి పడ్డారు.

మండలంలోని దబ్బతోగు,వాగొడ్డుగూడెం లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కేవీపీఎస్ నాయకులు మడిపల్లి వెంకటేశ్వరరావు,గిరిజన సంఘం నాయకులు కుంజ మురళీ,సీసం నాగేశ్వరరావు,మునెమ్మ,దుర్గారావు,సీసం రాంబాబు లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img