Friday, May 23, 2025
Homeరాష్ట్రీయంఆఫీసుకు ఆలస్యంగా రావడమేంటి?

ఆఫీసుకు ఆలస్యంగా రావడమేంటి?

- Advertisement -

మార్కెటింగ్‌ శాఖ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ఉద్యోగులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి వారు ఆలస్యంగా రావడంపై ఆయన సీరియస్‌ అయ్యారు. గురువారం హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లోని మార్కెటింగ్‌ శాఖ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రధాన కార్యాలయంలో ఫేస్‌ రికగేషన్‌తో పాటు బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలస్యంగా వచ్చిన సిబ్బంది మీద వెంటనే మెమో ఇచ్చి, సంజాయిషీ తీసుకోవాల్సిందిగా మార్కెటింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు 53మంది రెగ్యులర్‌ సిబ్బందిలో 16మంది ఆలస్యంగా హాజర య్యారనీ, 42 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో ఐదుగురు మాత్రమే ఆలస్యంగా హాజరయ్యారనీ, వారికి మెమో జారీ చేశామని తెలిపారు. ఇకపై ఆలస్యంగా వచ్చిన అధికారులు, అందుబాటులో లేని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -