ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’. ఈ భారీ పాన్- ఇండియా యాక్షన్
చిత్రాన్ని చూసేందుకు ఎన్టీఆర్, హతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ కోసం డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ ‘వార్ 2’ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ పాత్రలు మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. కియారా అద్వానీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర బృందం తెలిపింది.
డబ్బింగ్‌లో ‘వార్ 2’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES