హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. విడుదల కాకముందే సంచనాలు నమోదు చేయటం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్‌ల అనూహ్య కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ‘కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా మొదటిసారి ఎన్టీఆర్ విలన్ పాత్రలో కన్పించబోతున్నారు. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు తెరపై తలపడనున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయిక. ఆర్‌ఆర్‌ఆర్, దేవర సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాన్ని సొంతం చేసుకోవటం ఎన్టీఆర్ మంచి ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవటం ఓ రికార్డ్‌గా చెప్పారు. ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, సునీల్ నారంగ్ ఈ హక్కులను చేజిక్కించుకున్నారు. విడుదలకు మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ.85 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్యలో అమ్ముడైపోయాయని సమాచారం. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.
విడుదల కాకముందే ‘వార్ 2’ రికార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES